అమ్మ మనకు తల్లి -- మన తల్లులందరికి తల్లి

 

ఆదిపరాశక్తి - లలితా పరమేశ్వరి. మన 'అమ్మ' సమానాధికవర్ణిత. అటువంటి అమ్మ "నామి కంటే నామము గొప్పది నాన్నా!" అని చెప్పెంది. 'జయహో మాతా! శ్రీ అనసూయా! రాజరాజేశ్వరి! శ్రీ పరాత్పరి!' అన్న నామము కంటే శక్తివంతమైన మహా మంత్రము సృష్టిలో లేదు.

 

నిజాజ్ఞారూపనిగమ అయిన మన అమ్మ అవ్యాజకరుణాపూరిత కూడా. వాత్సల్యంతో ప్రేమతో సృష్టిని ఉద్ధరించాలన్న కరుణతో, అమ్మ నామమంత్రములలో వున్న మాహత్మ్యాన్ని అమ్మే మనకు తెలియపరంచింది.

 

వసుంధర అక్కయ్య చెల్లెలు అమ్మాజీ తన చిన్నతనంలో కొంత కాలం అమ్మ దగ్గర ఉంది. ఒకసారి అలంకార హైమ దగ్గర నామం చేస్తోంది. ఇంతలో ఎవరో వచ్చి "నిన్ను అమ్మ పిలుస్తోంది" అని చెప్పారు. అమ్మాజీ నామం ఆపేసి అమ్మ దగ్గరకు వెళ్ళింది. మంచం మీద పడుకొని వున్న 'అమ్మ' లేచి కూర్చొని "ఏం చేస్తున్నావమ్మా?" అని అడిగింది. "నామం చేస్తున్నానమ్మ!, నీవు పిలిచావంటే వచ్చాను" అంది. అమ్మ గంభీరంగా "నామం చేస్తున్నప్పుడు నేను పిలిచినా సరే రాకూడదని" చెప్పింది. ఆ రోజునుంచీ అమ్మాజీ నామం చేస్తుంటే ఏవిధమైన అంతరాయాన్నీ సహించదు.

 

సర్వజ్ఞ అయిన 'అమ్మ' కు అమ్మాజీ నామం చేస్తోందని తెలియదా? నామ ప్రాశస్త్యం మనకందరికీ తెలియజెప్పటానికే ‘అమ్మ’ ఈ సంఘటనను సృష్టించింది.

 

ఒకసారి రామబ్రహ్మం గారు అమ్మ దగ్గర కూర్చోని వున్నారు. అమ్మ ఆయనకు అనేక వేదాంత రహస్యాలను తెలియజేసింది. రామ బ్రహ్మంగారు చాలా నిజాయితీ పరులు. గాయత్రీ మంత్రం గురించి మాట్లాడుతూ ‘అమ్మ’ ఆయనతో అంది , "గాయత్రీ మంత్ర పురశ్చరణ వలన ఏ ఫలితం వస్తుందో --జయాహోమాతా నామం చేస్తే అదే ఫలితం వస్తుంది నాన్నా!" అంది.

 

"నగాయాత్ర్యాః పరం మంత్రం నమాతుః పరదైవతం" అన్నది ఆర్యోక్తి.

 

గాయత్రీ మంత్రానికి మించిన మంత్రం లేదు. అయితే గాయత్రి మంత్రం అందరికి అందుబాటులో లేదు. స్త్రీలు గాయత్రీ మంత్ర పునశ్చరణకు అనర్హులని బ్రాహ్మాణేతరులు గాయత్రీ చేయరాదని ఒక అపప్రధముంది. గాయత్రీ మంత్రం పునశ్చరణ ప్రభావము ‘అమ్మ’ జయహో మాతా ద్వారా సృష్టికంతకూ ప్రసాదించి కర్మయోగియైన రామబ్రహ్మంగారి ద్వారా ఈ వరాన్ని మనకి అందజేసింది.

 

“అమ్మ” – పుణ్యా-పుణ్య ఫలప్రద

 

పుణ్యం చేసినవారికి సత్ఫలితాలను ప్రసాదిస్తుంది. అపుణ్యం చేసిన వారి ఇంట్లో -అలక్ష్మీ రూపంలో తాండవిస్తుంది http://enligneviagra.net/kamagra-oral-jelly/. కర్మ దగ్ధమవ్వాలంటే జ్ఞానం వలన దగ్ధమవుతుంది. "జ్ఞానాగ్ని దరగ్ధ కర్మాణి" అన్నారు పెద్దలు. అమ్మ చీరాల డాక్టరు గారితో అంది "వాడికి నామం చెయ్యటమే జ్ఞానం" అని. అమ్మ నామం చెయ్యటం వలన దుష్కర్మ దగ్ధమవుతుంది.

 

అమ్మ సన్నిధానం ఆనంద రసదాయకం. మనం అమ్మ దగ్గరే ఉండాలంటే అమ్మ నామం సులభతమమైన మార్గం. ఒకసారి 1981లో చాలామంది వుండటం వలన అమ్మ దగ్గర కూర్చోలేకపోయాను. కానీ, అమ్మ దయవలన నిరంతరాయంగా నామం సాగింది.తిరిగి హైదరాబాదు వెళ్ళే రోజున అమ్మ దగ్గరికి వెళ్ళి "ఈసారి నీ దగ్గర ఉండలేకపోయానమ్మా!" అన్నాను. అమ్మ వెంటనే అంది, "ఈసారే నా దగ్గర ఉన్నావు. ఆగకుండా నామం చేస్తూనే ఉన్నావు గదా!" అని.

 

అమ్మ సాన్నిధ్యం అమ్మ నామం వలన లభిస్తుంది. మనం అమెరికాలో ఉంటూ అమ్మ వద్దనే ఉండవచ్చు.

 

జ్యోతి (నా భార్య భగవతి చెల్లెలు ) అమెరికా లో ఉండేది. ఒకసారి ఆ అమాయి ఉద్యోగం పోయింది. భగవతిని ‘ఏం చెయ్యమంటావు?’ అని అడిగింది. భగవతి తడుముకోకుండా జ్యోతితో "40 రోజులు (11 x 108 సార్లు) అమ్మ నామం చెయ్యి. నీకు మంచి ఉద్యోగం వస్తుంది" అంది. వెంటనే జ్యోతి శ్రద్దగా 40 రోజులు నామం చేసింది. 41 రోజున ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ జరిగి, చక్కటి ఉద్యోగం వచ్చింది.

 

నామం మోక్షకారిణి. అమ్మ నామం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. హైమ అక్కయ్య ఇశ్వర్య ప్రదాయిని. అమ్మ నామ పారాయణ వలన హైమక్క ఇశ్వర్యాన్ని ప్రసాదిస్తే - అమ్మ అనుగ్రహం వలన ఆత్మానందన్నీ అనుభవిస్తాం. అమ్మ నామం ఉభయ తారకం.

 

1923 అమ్మ జన్మించిన సంవత్సరం. 2023కి అమ్మ అవతరించి వంద సంవత్సరాలు నిండుతాయి. ఈ సందర్భంలో అమ్మ బిడ్డలందరూ కలసి, 100 కోట్లు అమ్మ నామ పారాయణ చెయ్యాలని సంకల్పం.

 

రండి అందరం కలసి అమ్మ నామ పునశ్చరణ మహాయజ్ఞంలో పాలుపంచుకొందాము. అక్షర లక్షలు అమ్మ నామం చేద్దాం. అనవరతం అమ్మ సాన్నిధ్యాన్ని అనుభవిద్దాం.

 

మీకు నామ పారాయణ లో ఆసక్తి వుంటే ఈ ఫోన్ నంబర్లని సంప్రదించండి. 086432-27234, 086432-27492 మరియు 098480-10418

                                                        జయహో మాతా!!!

 

Author: 
శ్రీ వారణాసి ధర్మసూరి
Source: 
శ్రీ రాజరాజేశ్వరి ఆర్షవైభవవికాస మాసపత్రిక సంపుటి 7 - సంచిక 5 - 2014(ఆగస్ట్ 14 నుండి సెప్టెంబర్ 13 వరకు)