ఆ రోజు 31-12-1984. రాత్రికి జిల్లెళ్ళమూడిలో ఘనంగా నూతనసంవత్సర వేడుకలు జరుగుతాయి. అర్థరాత్రి అమ్మ మనకు క్రొత్త సంవత్సరాన్ని అనుగ్రహిస్తారు. సాయంత్రానికే జనం ఎక్కడెక్కడినుంచో అక్కడికి వచ్చారు.

 

అయితే అనుకోకండా జిల్లెళ్ళమూడిలో విపరీతంగా వర్షం పడుతూనే వుంది. మబ్బుపట్టి వాతావరణం చాలా చీదరగా వుంది. దీనికి తోడు కరెంటు లేదు. (లైట్లు లేవు). అందువల్ల నీళ్ళు లేవు.

 

ప్రతి సంవత్సర లాగ అమ్మ క్రిందకు దిగి వేదిక మీదకు వస్తానన్నారు. ఏం చెయ్యటం? వేదిక బాగా అలంకరించారు. అమ్మ స్నానం ముగించుకొని సరిగ్గా 12 గంటలకు వేదికనలంకరించి క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభించటం అలవాటు గదా! టైము దగ్గర పడుతుంది. వెంటనే అమ్మ బాత్ రూమ్ లోకి వెళ్లి, క్లుప్తంగా వాష్ చేసుకొని, చీర కట్టుకొని దిగి వచ్చేశారు. రామకృష్ణ , అన్నంరాజు రామకృష్ణా రావు అమ్మ తోడుగా వచ్చారు. తీవ్రంగా జబ్బు పడ్డ అమ్మ స్వయంగా మెట్లు దిగి వచ్చారంటే విడ్డూరమే.

 

వేదిక మీద అమ్మ సరిగ్గా రాత్రి 12 గంటలకు రిబ్బను కత్తిరించి 1985 వ సంవత్సరాన్ని జై జై ధ్వనాల మధ్య ప్రారంభించారు. కరెంటు లేకపోవటం వలన పెట్రోమాక్స్ లైట్లతోనే కార్యక్రమం ఘనంగా జరిగింది.

 

జిల్లెళ్ళమూడిలో ఏ పని జరగాలన్నా, దానికి ఏది అడ్డు రాదు. తుఫాను పట్టిన సరే! అమ్మకు టైమంటే టైమే.!

 

మరొక అనుభవమేమంటే;

 

ఒకనాడు అమ్మ State Bank of India బ్రాంచి ప్రారoభించవలసి వుంది. బ్రహ్మండంగా ఆకాశం చిల్లులు పడ్డట్టు వర్షం. అయితే సరిగ్గా ముహూర్తానికి వర్షం విచిత్రంగా ఆగి పోయింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్గం ద్వారా అమ్మ State Bank లోకి వచ్చి Branch ని open చేశారు. అమ్మది SB A/C No.1 గా నమోదు అయింది. staff అందరిని ఆశీర్వదించారు. కార్యక్రమం ఘనంగా జరిగిన తరువాత విందుజరిగింది. ఆ తరువాత మళ్ళీ బ్రహ్మండగా వర్షం అందుకుంది. నాకు ఎప్పుడు ఆ సంఘటనలు జ్ఞాపకం వస్తూనే వుంటాయి. ఎంత విచిత్రం!

 

Author: 
శ్రీ సాధు-అర్కపురి
Source: 
విశ్వజనని మాస పత్రిక 2005 ( సంపుటి 4 సంచిక 12)