ఎంత కాలమమ్మా! నాతో ఈ ఆటలు

ఎందుకమ్మా నీకీ దోబోచులు     llఎంతll

 

నన్ను గాలి వాటున పెట్టి

నీవు కొసను చేతను పట్టి     llఎంతll

 

మబ్బు మాటున నుండి నవ్వు తుంటావు

గాలి వాలున వచ్చి తాకుతుంటావ     llఎంతll

 

నా నిదురలో నీవు గుస గుస లాడుతుంటావు

పట్టుకుందామంటే జారి పోతుంటావు     llఎంతll

 

కనులు మూసుకుంటే ఎదుట నిలుచుంటావు

రెప్ప విచ్చుకుంటే శూన్యమై ఉంటావు     llఎంతll

 

Author: 
కీ శే శ్రీ లక్ష్మీ నారాయణ