‘హైమలో మూడు అంశలు వున్నాయి’ అని అమ్మ అన్నది. కారణం ఏమిటి? అని ఆలోచిస్తే, అవి మనలోను వున్నాయని, హైమ వాటిని తెలుసుకుని అ స్థితిని పొందినదని, మనము తెలుసుకోలేకపోయామని అర్ధమవుతుంది. అందుకే అ స్థితిని పొందటానికి వారిని మనం ఆరాధిస్తాము. అయస్కాంత సన్నిదిలో ఇనుపముక్కలో దాగివున్న అయస్కాంత ధర్మం మేలుకొంటుంది. ఇనుప ముక్క అయస్కాంతం అవుతుంది.

వినాయకుడు "ఓంకార´ (ప్రణవ) స్వరూపుడని కుమారస్వామి అన్నట్లుగా మనం చెప్పుకుంటాము, మనము గాలి పీల్చి వదిలేటప్పుడు జరిగే క్రియకు వచ్చే శబ్దమే ప్రణవ నాదము. సర్వకాల సర్వావస్ధలలోను మనకు తెలుస్తున్నపుడు తెలియకుండా (నిద్రలోను) ఆ క్రియ జరుగుతూనేవుంటుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనన్సు పెట్టి గమనిస్తూ చేసేదాన్నే 'ధ్యానం' అంటాము. "శ్వాసమీద నిఘా వెయ్యి నాన్నా!" అని అమ్మ చెప్పింది.

అంజనేయస్వామి వాయుపుత్రుడు. ఆ వాయువు మీదనే ఆధారపడి జీవిస్తున్నాము, కనుక, మనమూ వాయుపుత్రులమే. మనలో ఆ వాయుపు లేనివాడు శవమే. ఆ వాయువు ఆధారంతో-మూలధారంలో వుండేదే వినాయకస్ధానం.

కుండలినీ శక్తిని ప్రచోదనం చేస్తే సుషుమ్నా నాడి ద్వారా ఊర్ధ్వదిశగా ప్రయణిస్తుంది. శ్రీరాముడు 'వాయు' పుత్రుడైన ఆంజనేయస్వామి ఆధారంతో సీతమ్మ జాడ తెలుసుకున్నాడు. అలాగే మనము ఆ వాయువు ఆధారంతోనే మన చుట్టూ ఉన్న సహస్రారంలో వున్న శక్తిని మేలుకొలపాలి. మన యోగసాధనకు ఏ అడ్డంకులు లేకుండా అక్కడ వున్న శక్తి సహకరిస్తుంది. ఆ శక్తినే విఘ్నేశ్వరుడు అంటారు. అందుకే లలితతో 'కామేశ్వరముఖ’ లో కల్పిత ‘శ్రీ గణేశ్వరం' అని, విఘ్నేయంత్ర ప్రహర్షిత" అని అంటారు. అ శక్తి ఆరు చక్రాలను దాటి సహస్రారానికి చేరేదే ‘కుమారస్వామి’ తత్త్వము. అందుకే ఆయనను ఆరుతలలు కలవాడు అన్నారు. ఆ శక్తి పాము మెలికలు లాగా ఆరు చక్రాలమీదుగ ప్రయాణం చేస్తుంది కనుక ఆ శక్తిని "సుబ్రహ్మణ్యము" అని కూడ అంటారు. బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవట ఆ ప్రక్రియలు- హైమలో జరిగినవి, అందుకే జ్ఞానచక్రం (రుద్రస్ధానాన్ని) చేరిన ఆ శక్తి అమ్మ అనుజ్ఞకోసం ఎదురుచూస్తుంది.

అతప్యత స్మ అభిలలోక తపనం

తపస్తపీయాంస్తపతం సమహిత:

'తపోవ్రతులలో అగ్రగణ్యూడైన అతడు ఏకగ్రతతో ఎంతటి నఢ తపమాచరించాడంటే అతడికి అఖిల బ్రహ్మాండాన్ని సృజించే సామర్ధ్యం, జ్ఞానం కలిగాయి.

హైమలో వున్న వాయువు. బయటకు వెళ్ళగా కట్టె అయిన ఆ శరీరాన్ని సమస్కరించి , మరల అ వాయుపుత్రుడిని ప్రవేశింపచేసి, ఆంజనేయుని అంశగా రక్తప్రసరణ గావించి, ఆ శక్తిని ఆరు చక్రల మీదుగా ప్రవహింపచేసి ఆరు తలల కుమారస్వామిగా చేసి, శిరస్సుని చిట్లింపచేసి (కపాలమోక్షం గావించి) పాత తలలో కొత్త శక్తిని నింపింది. ఈశ్వరుడు వినాయకుని తలను భేదించి ఆ తరువాత గజశిరస్సును తెచ్చి అతికించినట్లుగా అమ్మ హైమను వినాయకుడిని చేసింది. అందుకే హైమలో ఆంజనేయ,, కుమారస్వామి, వినాయకుని తలలు దాగివున్నాయి.

అమ్మ మన యొక్క సాధనకు విఘ్నాలు లేకుండా చేయగలందులకే తన స్నానాల 'గది 'లో సంకల్పం చేసి ఆస్ధానంలో విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్ఠ చేయిస్తున్నది అమ్మ. అందుకే మనసు యోగ సాధన నిమిత్తం వినాయక నవనాగేశ్వరాలయమును ఏర్పాటు చేసింది అమ్మ. అలాగే ఎప్పటికైనా ఆంజనేయస్వామి ఆలయం వస్తుంది, కారణం కొంతకాలం ఒక వానరం రోజు అమ్మ దగ్గరకు వస్తూండేది. ఎంతో ప్రేమగా అమ్మ తన దగ్గరకు తీసి ఆదరిస్తు వుండేది. అది కొంతకాలానికి అమ్మలో ఐక్యమైంది. దాని శరీరాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి అమ్మ సంస్ధకు దక్షిణంగా వున్న తోట స్ధలంలో ఖననం చేశారు. ఈ ఖననం అమ్మ ఆదేశానుసారము జరిగింది. ఆనాడే ఆంజనేయస్వామి గుడి వస్తుంది అని అమ్మ చెప్పింది. అమ్మది "తోలు నోరు కాదు కదా! తాలు మాట రావటానికి". ఈ ఆలయాలు ఉన్నవి మన యోగ సాధనలకు ఉపయోగపడటానికే.

Author: 
కీ.శే శ్రీ రాచర్ల లక్ష్మి నారాయణ
Source: 
తత్వమర్ధస్వరూపిణి - జూన - 2006