విగ్రహము అన్నది భక్తుడు దైవానికి ఊహించిన రూపం. భగవంతుడు మానవణ్ణి తన రూపంలోనే సృజించాడన్నది ఎంత నిజమో మనకు తెలియదు గాని, మానవడు భగవంతుణ్ణి తన రూపంలో ఊహించుకోడం నిజం. మానవుడికి రెండు చేతులయితే శక్తిమంతుడైన భగవంతుడికి నాలుగూ, ఎనిమిదీ పదీ, పన్నెండు చేతులోచ్చాయీ. మానవుడి ఆయుధాలు అన్ని రకాలూ భగవంతుడి చేతుల్లో అమిరాయి. మానవుడికి స్వాధీనం కాని వాహనాలూ వాటికంటే వేగవంతమైనవీ --- గరుత్మమంతుడూ, హంస వంటివీ --- శక్తివంతమైనవి ---- మొసలి, సింహం వంటివి -- భగవంతుడికి ఉన్నాయని ఊహించారు. లోకం లోని సిరి --వజ్ర మాణిక్యాలు ముత్యాలు బంగారమూ, లోకేశ్వరుడివే అన్నారు. ఆయనకు ఇచ్చిన రూపాన్ని సర్వాభరణ భూషితము చేసారు. మానవులలోని రుచి వైవిధ్యాన్నీ బట్టి విద్యా దేవీ, లక్ష్మీ దేవీ , శక్తీ ,సృష్టీ స్థితీ లయమూ, వర్షాగమమూ, జగత్ప్రాణము, వాయువూ, అగ్నీ, సూర్యుడూ, సముద్రాలూ, దేవసేనాపతీ, విఘ్నరాజూ, జ్ఞానమూర్తీ అర్చావతారములైనారు. సర్వశక్తుడు బహువచనము కాదన్న ఊహ సర్వాంగీకారము పొందటముతో ఎవరికి నచ్చిన రూపానికి వారు సహస్రనామాలూ సర్వశక్తిమత్వమూ ఆరోపించుకుని పూజించుకున్నారు. నాకు నచ్చిన సుగుణాల్నీ శక్తుల్నీ, సౌందర్యాన్నీ రాశిపోసి రూపం చేసుకొని నేను పూజ చెయ్యటం నయమే కాని ఈ పూజ 'తెలిసి' చేసినది కావాలి. అంటే ఆ సుగుణాల్ని శక్తుల్ని సౌందర్యాన్నీ ఉద్దేశించి పూజించాలి కాని ఆచేతుల్నీ, జంఘాల్నీ ఉదరాన్నీ కటినీ నాభీనీ కాదు పూజచేయాల్సింది. సహస్రానామాలన్నవి ఈ మెలకువను లేపి ఉంచటానికే అవతరించాయి అనిపిస్తుంది. రూపము మీద మాత్రమే దృష్టి పెట్టుకుని, ఆ రూపాలు సూచించే గుణాలూ సిరిసంపదలూ నిండుదనాలూ వదిలిపెట్టినవారే, 'చక్రము గొప్పదనీ , శూలము గొప్పద’నీ దెబ్బలాడుకుంటారు. విగ్రహమన్నది వైభవాన్నీ విభూతినీ పూసగట్టి భక్తుడి ఎదుట నిలుపుకునే నిగ్రహము కోసమే. ఆ మహా భావాలు లేని పూజ శివ పూజ కాదు , మరి శవ పూజయే. ' మహాపురుషల శవా న్ని గౌరవించినా ఫోటోలకు దండవేసినా వారి గుణాలను గౌరవించడము కోసం చేస్తామే కాని ఆ చేతులకూ కాళ్ళకూ అని కాదుకదా! ఈ స్ఫురణ లేకపోతే ఆ దండలు ఏమిటన్నమాటా?
‘అయితే విగ్రహము ఎందుక్కావలసి వచ్చింది. అది లేకుండా అర్చన జరపుకోకూడదా?’ అంటే హాయిగా జరపుకోవచ్చును. కానీ పూజ చేసే సుగుణాలు శక్తులు అందాలూ మనస్సుకు పట్టి పూజ చెయ్యాలి. మనస్సు ఎక్కాడో ఉండి ప్రార్థన అన్నది నలుగురితో పాటు కూర్చుంటూ లేవడమే అయితే ఏమైనట్టూ? అలాంటి వారికి విగ్రహమన్నది ఎదురుగా ఉంటే, "ప్రభువే జగన్నాటకాన్నంతటినీ నడుపుతున్నడూ, జగత్ప్రాణమైన అగ్నీ గ్రహాదీ ఖగోళాల్నన్నిటినీ జరిపే లయా, విశ్వమంతటా నియమానుసారంగానూ, నియమ రహితంగానూ వర్తించేటట్టు కనబడే చలనమూ మనస్సుని పదే పదే ఆక్రమించ యత్నించే మాయను తొక్కే విజ్ఞానమూ అంతా "ప్రభువే" అన్న నిగ్రహము కలిగే అవకాశము కొంచెము ఉన్నది. (ఆ విగ్రహము నటరాజస్వామిదైతే). ఇంద్రియ గోచర మయ్యే వస్తువు, దానికి సంబంధించి వున్న ఆలోచనా స్రవంతి ని రేపుతుంది. ఈ ఆలోచనలను మనస్సులో నిలిపే నిగ్రహము కోసమే విగ్రహారాధన, ఈ నిగ్రహము కాక ఎదటి విగ్రహపు నాలుగు చేతులూ, కిరీటమూ, అలంకారాలూ మాత్రేమే మనస్సుకు తట్టితే అది దైవత్వాన్ని పూజించడమవదు. ఏమంటే, "దైవత్వమంటే నాలుగు చేతులూ కిరీటము కాదు" అన్నారు అమ్మ.
"(సర్వ వస్తువులా) రూపము (అనగా రూప శోభ) లక్ష్మి,(వాటి) లోని శక్తి పార్వతి (వాటి వినియోగ) జ్ఞానము సరస్వతి" అన్నారు అమ్మ. "పంచ భూతాల శక్తి గాయత్రి' అన్నారు. 'అన్నం పరబ్రహ్మ అయితే ఆశుద్దమో?' అన్నారు , అంతా చైతన్యమే , నా దృష్టిలో జడమే లేదు.' అన్నారు ఈ విశ్వాసాలకు దారి చేసే మనో "నిగ్రహము, కోసమే విగ్రహారాధన ' ఏ రూపము లో కొలిచినా ఆ రూపంతోనే వారి ననుగ్రహిస్తానన్న భగవంతుని మాట, ఆ కొలువునకు సంబంధించి నది కాని ఆ రూపానికి కాదు. స్వామి కి ఒక్క రూపమనగా యేమిటి? అన్ని రూపాలు ఆయనవే కనుక నిరాకారుడు ' సర్వ దేవ నమస్కారం--- కేశవం ప్రతి గచ్ఛతి.’
నీకు మనోనిగ్రహం ఏర్పడక పోతే పూర్వ దిశల్లో పశ్చిమ దిశ లో, అన్ని దిశల్లో, కిందా పైనా వుండే -- నీకు నచ్చిన -దేవతలకు నమస్కారము చేసుకో, ఉన్నది ఒక్కటే,. ఏకమే వాద్వితీయం బ్రహ్మ'. ఈ విగ్రహాలన్నీ ప్రభువు గుణాలకు మానవ రూపాలు. అన్ని గుణాలూ ఆయనవే . ఏ ఒక్కటీ మాత్రమే కాదు. నీ మనస్సులో తెరుచుకొనే కిటికీ ఏదైనప్పటికీ నువ్వు చూచేది అంతులేని అమ్మనే. నీవు చూడటానికి వీలిచ్చే 'నిగ్రహము కోసమే విగ్రహారాధన'
విగ్రహము అంటే శిల్పించిన రూపమే కానక్కరలేదు. మంత్రమూ విగ్రహమే. నీ విశ్వాసానికి అక్షర రూపమే మంత్రము: వట్టి అక్షరాల గుంపు కాదు. (విగ్రహం అంటే కాళ్ళూ చేతులూ జోడింపు కాదుగా!) 'తృప్తినీ హాయినీ శాంతినీ ఇచ్చి సందేహనివృత్తి చేసేదే మంత్రం' అన్నారు అమ్మ. మంత్రార్థము- అనగా మంత్ర లక్ష్యమే- తెలిసి చెయ్యాలి నువ్వు జపము. లేకుంటే ఇందాకటి 'ఉదరo పూజయా' మే అవుతుంది జపము కూడాను. మనో 'నిగ్రహము కోసమే (మంత్రాక్షర) విగ్రహరాధనము. ఆ మంత్రాక్షర శబ్దాలతో, ఇందొకటి విగ్రహ రూపము వలన ఆవిర్బవించే గంగయే ఆవిర్భవిస్తుంది అసలైన భక్తుల మనస్సులో , వారు మంత్రం జపము చెస్తారు. ముద్రలతో పూజ చేసేవారు, శరీరంలో వారూహించిన చక్రాలలో ఆయా సద్గుణాలూ విభూతులూ గల దేవతల ఉనికిని నమ్మి రాజ యోగ సాధన చేసేవారు, నిగ్రహము కోసమే ఆయా సాధనాలను ఉపయోగించుకుంటున్నారు. ఏక దేశ నిక్షిప్తమై ఏక రూప స్వీకారము చేసిన రాతి విగ్రహమూ విగ్రహమే. ఆ అక్షరాలతోనే ప్రభువు ను సూచించుకొనే మంత్రమూ విగ్రహమే. ఆముద్రలనే ఆ వరసతో చేసే ముద్రాకును మార్చినా విగ్రహపూజే, రాజయోగ సాధనా 'విగ్రహారాధనే'. 'నిగ్రహం కోసమే విగ్రహారాధన' అన్నట్లే నిగ్రహము తెచ్చేదే విగ్రహము' అనీ అనవచ్చునేమో. నిగ్రహము తేనివి గ్రహాలే, విగ్రహాలు కావు, బొమ్మలుకానీ, మంత్రాలుకానీ ముద్రలుకానీ, ప్రార్థనలు కానీ, విగ్రహ ధ్వంసము చేసేవారు రాయి దేవుడు కాదంటారుకానీ రాతిలో దేవుడు లేడనరు. 'రాతిని పూజించి దేవుణ్ణి మరిచిపోతావురా' అంటారు. సర్వశక్తుణ్ణి పూజించాకా, ప్రార్థించా కా రాతిని పూజించడమేమి?' అంటారు. నీ పూజ సర్వాత్ముడికే అయి దేవుణ్ణి నీవు రాతిగా ఊహించిక పోతే ఆ విగ్రహము నీ నిగ్రహానికే, అమ్మ అంటారు, అలుకు గుడ్డలో కూడా దేవుణ్ణి చూడు' అని. చీపురు,రోకలి -రోలు చేట వంటివాటి పనులలో వేదాలు చేసేపనిని దర్శింపజేస్తున్నారు. అలాగ, నిగ్రహం కోసమే విగ్రహారాధన ,విగ్రహపు రూపమూ ఆయుధాలు అలంకారాలు గంటలు పూజలు నిన్ను భగవత్సన్నిధికి క్షణ మాత్రమైన తీసు పోకపోతే, నీకు నిగ్రహము రాకపోతే ఆ విగ్రహారాధన ఆరాధన కాదు; ఆ బాధనే