2004 లో శ్రీ నవనాగేశ్వర ఆలయానికి రూపకల్పన జరిగిన తరువత, ఆ పని నిమిత్తం బెంగుళూరు వెళ్ళి శ్రీ రాజ రాజేష్వరి దేవస్థాన వ్యవస్థాపకులైన శ్రీ శ్రీశ్రీ తిరుచ్చి స్వామిగారితో సంప్రదించిన రోజున వారు "వినాయకుని గుడి కట్టి, నాగేశ్వరాలయం కట్టరాదా?" అని సూచించారు.
శ్రీ నాగేశ్వరాలయం పూర్తి కావస్తువుంఢగా అంటే 2005 మా ర్చి/ ఏప్రల్ లో ఒక రోజున శ్రీ బ్రహామంఢం రంగశాయి (యు.యస్.ఎ.) నుండి ఫొన్ వచ్చింది. "జిల్లెళ్ళమూడిలో వినాయకుని గుడి కడితే ఏలా వుంటుంది?" ఆని ఆడిగాడు. "నీ ఉద్దేశం ఏమిటి?" ఆని సలహా ఆడిగాడు. నాకు ఆనందం కలిగింది. కారణం, ఆది బెంగుళూరు స్వామివారునకు ఇచ్చిన సూచన కనుక.
అయినా, నేను అన్నాను "నాకు ఏ ఆలోచన లేదు, ఈ ప్రస్తావన స్వామివారు సూచించారు. సంకల్పం ‘నీ’ ద్వారా వచ్చింది అంటే అది 'అమ్మ' సంకల్పమే ! స్వామివారి నోట సూచనప్రాయంగా నిర్ణయం మనకు చేరింది; అందుకు 'అమ్మ' నిన్ను నిర్ణయించి ప్రేరణ కలిగించి ఉండవచ్చు" అని.
శశ్రీ రంగశాయి సంతోషించి ఆ కార్యక్రమాన్ని తన భుజ స్కంధాలమీద వేసుకొని ఆ పనిని నిర్వర్తించడానికి నన్ను కోరాడు. ఆనందంతో 'అమ్మ' సేవగా ఆ సోదరుని కోరిక మెరకు చేపట్టాను.
ఒక సందర్భంలో హైమను గురించి అమ్మ మాట్లాడుతూ - "వినాయకుడు, కుమారస్వామి, ఆంజనేయస్వామి అంశలతో పుట్టింది నాన్నా!" అని వివరించింది. ఆ కారణంగా వినాయకుని అంశ అయిన హైమకు కూడా సేవచేసే సౌభాగ్యం కలిగింది . సంతోషించి ఆ కార్యక్రమభారాన్ని స్వీకరించాను.
గర్భాలయం రూపుదిద్దుకుంటుంది. ఆ సమయంలొ శ్రీ భుచ్చిరాజు శర్మ (రాజుబావ ) జిల్లెళ్ళమూడిలో 4, 5 రోజులు ఉన్నాడు. ఆ సందర్భంలో అడిగాడు. "ఇక్కడే వినాయకుడు, గుడి కట్టాలనే సంకల్పం, గర్భాలయం ఆ స్ధలంలోనే నిర్మాణం చేయాలని నీకు ఎందుకు అనిపించింది? కారణం ఏదైనా వున్నదా?" అని. నా మనస్సుకు ఇక్కడ కట్టాలని తోచడమే , కాని, అంతకు మించి ఏ కారణం లేదు, మొదట అక్కడ సూచన నేను చేయడం, కమిటి వారు దానికి వ్యతికేరించి అది విఫలం కావడం, చివరకు ఆ స్ధలంలోనే కట్టబడి, ప్రారంభం కావటం జరిగిందని తెలియపరిచాను.
శ్రీ బుచ్చిరాజు ఆనందించి "అదే సరి అయిన స్ధలం" అన్నాడు. నేను ఆశ్చర్యపోయను. ఎక్కడైతే వినాయకునికి "గర్భగుడి" ఏర్పడుతున్నదో- అ స్ధలంలోనే ‘అమ్మ స్నానాల గది’ వుండేదని, అక్కడే 'అమ్మ ' స్నానం చేస్తూ ఉండేదని ఆయన వివరించారు.
నాకు ఆనందం కలిగింది. 'అమ్మ ' మాట గుర్తుకు వచ్చింది. "ప్రేరణే భగవంతుడు నాన్నా!" అని. ఆ ప్రేరణతోనే పార్వతి వినాయకుని నలుగుపిండితో 'బొమ్మని’ చేసి, అందంగా రూపుదాల్చిన ఆ బోమ్మకు ప్రాణం పోసి, వినాయకుడిని చేసింది. ఇది అందరికి తెలిసిన కధే!
1941 లో అమ్మ, నాన్న గారు, సుబ్బారావు పసివాడిగా వుండగా జిల్లెళ్ళమూడిచేరి స్ధిర నివాసం ఏర్పరచుకున్నారు. అస్ధలమే ఇపుడున్న శ్రీ నవ నాగేశ్వరాలయ యాగశాల ప్రాంగణం.'అమ్మ' అన్నట్లు 'నాగేంద్రుడే' నాగేశ్వరుడై వచ్చాడు. ఆ ప్రకారం నాన్నగారు తన అఫీసుగా చేసుకొని నివసించిన స్ధలంలో "శ్రీ నవ నాగేశ్వరాలయం", అమ్మ స్నానాల 'గది' స్ధానంలో వినాయకుని గర్భాలయం ఏర్పడటం ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఇదంతా 'అమ్మ ' ఏర్పాటు. . అవును నిజం. .
ఆ స్నానాల ' గది లోనే 'అమ్మ' స్నానం చేస్తూ సంకల్పించి ఉండవచ్చు, అక్కడే వినాయకుని గుడి ఏర్పడాలని. ఆ సంకల్పానికి అనుగుణంగానే ‘శ్రీ బెంగుళూరు స్వామి వారు సూచించడం, శ్రీ రంగశాయి (యు.యస్.ఏ )కి వినాయకుని గుడి కట్టాలని ప్రేరణ కలగడం, అమ్మ అనుగ్రహంతో ఆ భాధ్యతను నేను ఆనందంగా స్వీకరించడం జరిగాయి అని అనిపిస్తుంది. 'అమ్మ' దయతో అ గుడి అందంగా రూపు దిద్దుకుని, ప్రతిష్థకు సిద్ధంగా వుంది.
2006 జూన్ 1వ తేది ప్రతిష్థ జరుగుతుంది. సిద్దక్షేత్రమైన జిల్లెళ్ళమూడిలో వరసిద్ధి వినాయకుణ్ణి దర్శించి, సేవించి, తరించే మహద్భాగ్యాన్ని మనకు ఆనుగ్రహిస్తున్న 'అమ్మ 'కు సాష్టాంగ ప్రణామాలు సమర్పిద్దాం. విగ్రహ ప్రతిష్ఠ భగవంతుని-ప్రతిష్ఠ మనం కాదుగా చేయాల్సింది. మనకు ఏం సాద్యంవుతుంది? అంతటా ఉన్న భగవంతుడు ఒక చోట 'ఇక్కడ ఉన్నాడని’ ప్రతిష్థిస్తున్నామంటే అది మన గుర్తు కోసం, లక్ష్యం కోసం. దాన్ని విగ్రహం, రాయి-అనుకోవటం లేదుగా. భగవంతుడు అందులో ఉన్నడనుకుంటున్నాము.
Source:
తత్వమర్ధస్వరూపిణి - జూన - 2006