ఈసారి అమ్మ పుట్టిన రోజు మార్చి 30న జరుగుతుంది (గేయం)
తరలిరండి! తరలిరండి!
మీరందరు కూడి,
వడివడిగా రండి-రండి!
ఈ జిల్లెళ్ళమూడి
తరలిరండి! తరలిరండి ! ............................
పుత్రపౌత్రులందరికి పుణ్యదినం
పవిత్ర మాతృదేవతలకు పర్వదినం
చరిత్రలోన నిల్చే వెలుగు శుభదినం
అదే మాతృశ్రీ మహితమూర్తి జన్మదినం
తరలిరండి! తరలిరండి ! ............................
తరిగి తరిగి పోతున్న ధర్మాన్ని
మరుగున పడిపోతున్న మానవత్వాన్ని
సముద్ధరించి జగమును రక్షించుటకు
సమ మానవతా జ్యోతిని వెలిగించుటకు
ఇమ్మహిలో అడుగిడిన శుభదినం
"అమ్మ" గా అవతరించిన శోభదినం
తరలిరండి! తరలిరండి ! ............................
పుణ్యస్థలి మాతృశ్రీ నిలయంలో
పవిత్ర విశ్వమానవాలయంలో
జన్మదిన వైభవాన్ని తిలకించండి
ధన్యజీవులై చూచి తరించండి
తరలిరండి! తరలిరండి ! ............................