అనంతమైన విశ్వమే - విశ్వమాత హృదయం

 

అనసూయమ్మ చల్లని హృదయమే – సర్వ ప్రాణి కోటికి నిలయం

 

అన్నపూర్ణ హస్తమే - సర్వ జీవాళికి అభయప్రదం

 

అవనిమాత దరహాస చంద్రికలే - మానవాళికి మలయమారుతం

 

అమృతవల్లి మంజుల కరస్పర్శయే - శిశువులకు సౌభాగ్యం

 

అర్కపురీశ్వరి నయనాల వెన్నెల వెలుగే - తనయులకు ఆధారం

 

అందరమ్మ అందించు గోరుముద్దలే - కొండంత నిబ్బరం

 

అమ్మ అమృత సూక్తులే - బిడ్డలకు ఆదర్శం

 

అందరిని ఆదరించి అవ్యాజానురాగం కురుపించు

 

అఖిలాండేశ్వరీ నీకిదే --- మా హృదయాంజలి

 

Author: 
శ్రీమతి గాత్రం నగజ కుమారి
Source: 
వమాతృశ్రీ మాసపత్రిక సంపుటి 9 సంచిక 12- మార్చి 1975