యోగదా

అది 1973 అమ్మ క్యాలండర్లు ఆర్డరు ఇచ్చారు. తయారై డేలివరీకి సిధ్దంగా ఉన్నవి. కానీ, సంస్థలో పైకం లేదు.  గోపాల్   నా దగ్గరకు వచ్చి విషయం వివరించి రూ 5000=00 సర్దితే ఒక నెలలో సర్డుతానన్నాడు.

 

అప్పటివరకు అమ్మ స్వయంగా అడిగితే తప్ప, నేను సంస్థకు అప్పు తేవటం గాని, ఇవ్వటం గాని జరగలెదు. తర్జన భర్జన అయిన తరువాత అమ్మ చెబితే ఇస్తావా? అని అడిగాడు.  నేను సరేనన్నాను.

 

జిల్లెళ్ళమూడికి  చేరి  అమ్మతో  ఫోన్ చేయించారు. నేను ఫోన్ ఎత్తాను. అమ్మ అడిగింది " ఏం నాన్న! నేను చెబుతే ఇస్తానన్నావుటగా? అవునన్నాను. అయితే ("చెప్పిద్దామనుకున్నావా?  అడిగి ఇద్దామనుకున్నావా?") దానిలోని భావం నాకు తెలియక, చెప్పిద్దామను కున్నానమ్మా ! అన్నాను. "చెప్పావుగా ఇవ్వు అని క్షేమ సమాచారాలు అడిగి అమ్మ ఫోన్ పెట్టేసింది ". తరువాత గోపాలు వచ్చి పైకం తీసుకు వెళ్ళటం జరిగింది .

 

తరువాత వారం జిల్లెళ్ళమూడి వెళ్లి అమ్మ దగ్గరకు చేరాను. అమ్మ అడిగింది . " డబ్బు తెచ్చావా?" అని గోపాలు వచ్చి తెచ్చాడు  అమ్మ అన్నాను. అంత నా సందేహము వెలిబుచ్చాను. అమ్మ నవ్వి "  చెప్పిస్తావా " అంటే నాకు తెలేయపరిచి ఇవ్వటం. " అడిగి ఇస్తావా "  అంటే  నీవు  ఇవ్వటం  నా  నిర్ణయం  మీద  ఆధారపడి ఉంది.

 

నా భావం అమ్మ ఇవ్వమంటేనే ఇవ్వాలని,  ఇక్కడ నన్ను పల్టీకొట్టించింది.  వారూ పిల్లలే  వారి అవసరాలకోసం  అలా జరిగి ఉండొచ్చు.

 

ఒకసారి మంచినీరు పడుతుందని ఆశెతో ఇప్పుడున్న వాటర్ ట్యాంక్ కు పడమరలో బోర్ వేయించారు. జియాలజిస్ట్ ను కనసల్ట్ చేసి స్థల నిర్ణయం చేసారు. త్రవ్వకం మొదలయింది. కొంత లోతుకు వెళ్ళిన తరువాత మంచినీరు పడింది. కాని, ఫోర్సు లేదు. ఇంకా కొంత లోతుకు వెళితే ఫోర్సు వస్తుందనీ వెళ్ళారు. కాని, కటిక ఉప్పులు పడటం, రెండు మూడు డైబిట్స్ విరిగి పోవటం జరిగి విరమించారు.

 

నేను అమ్మ దగ్గరకు చేరి "ఏమిటమ్మ ఇట్లా చేసావు/ఎంత శ్రమ, ఎంత డబ్బు వృథా?" అదేంటిరా నన్ను అంటావు. వారు నన్ను అడిగి చేయలేదుగా? అన్నది. అదేమిటమ్మ నీకు తెలియకుండా ఎలా చెస్తారు? అవును రా మంచి నీళ్ళు ఇబ్బందిగా వుంది, బోర్ వేయిస్తామన్నారు. సరే మీ ఇష్టం అన్నాను. నీవు చెప్పచ్చుగా నీరు పడదని. వారు అడగలేదుగా బోరు తీస్తే నీరు పడతాయా? తీయమంటావా? వద్దా? "అని, అప్పుడు ఏమి చెప్పేదాన్నో! ఇది అమ్మ తంతు. అందుకే అమ్మకు ఇష్టా ఇష్టాలు లేవు. మనం ఏపనైన చేస్తామంటే మన ఇష్టం అంటుంది. వాటి పర్యావసాన్ని ఫలితాన్ని మనకే వదులుతుంది. అదే అమ్మను 'అంఆ' గా చూచి అమ్మ నిర్ణయానికే వదులితే సరిగా మనల్ని గైడ్ చేస్తూంది. కాని, మనకు ఇష్టమైన కష్టమైన ఆమె నిర్ణయానికే వదలాలి. దానికే మనం కట్టుబడాలి. చెప్పటం వేరు, అమ్మను అడగటం వేరు.

 

అమ్మ 'విస్రింఖల'. అమ్మను మన తెలివితేటలతో కట్టివేయాలని ప్రయత్నిస్తే భంగపడటం తప్పదు. అమ్మ మాటలను మనకు అనువైన అంకెలకు తగిలించకూడదు. లోతులకు వెళ్లి అందులోని భావాన్ని అర్థం చేసుకొవాలి. మన అనుభుతులుకు అనుభవాలకి అన్వయించుకోవాలి. అంతేగాని మన మానసిక బలహీనతలకు స్వప్రయోజనాలకు అన్వయించకొకూడదు. అటువంటివి చాల జరిగినవి. అందులో కాలేజీ ఒకటి. నేను ఎన్నోసార్లు చూచాను. అమ్మ ఎంతో మధురంగా తనను తాను మరచి ఎంతో ఎత్తులో నుండి క్రిందికి వచ్చి మనకు అర్థమైన కాకపోయినా (ఎదుట ఉన్నవారికి) సృష్టి పరిణామము అధ్యాతిమిక శక్తిని గురించి అది తానై  చేప్తూ వుండేది. అమ్మ మన కోసమే మాట్లాడదు. తన లోని జ్ఞానాన్ని తరంగాలుగా ప్రపంచానికి వెదజల్లుతున్నదని అది అందుకోవటానికి తపస్వులు, యోగులు, సాధకులు ప్రపంచములో ఎందరో ఉన్నారని మనలో ఎందరికి తెలుసు? ఆలోచన వచ్చిన తరువాత తనకు ఈ  ఆలోచన వచ్చినదని చెప్పుతాం. ఆ ఆలోచన ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోమంటుంది అమ్మ. ఎట్లా అని మనలో సందేహాలు కలగవచ్చు. ఎక్కడో ప్రొడ్యూస్ అయిన టీవీ రేడియో వైర్లెస్ వలన ఏర్పడ్డ తరంగాలను మన ఇన్స్ట్రుమెంట్స్ల లో అందుకోవటం లేదా? చూడటం లేదా? అలాగే మన శిరస్సు ఒక కంప్యూటర్. అందులో ఉన్న మేధస్సు(సెల్స్) ఆ జ్ఞాన, ఆధ్యాత్మిక తరంగాలను అందుకుంటుంది. నిద్ర పోతున్నప్పుడు మన శరీరం మీద ఒక చిన్న కీటకం పాకుతుంటే మన శరీరం చర్మపు సెల్ నుండి బ్రెయిన్ సెల్ కు ఆజ్ఞ పంపి, చేయి దాని ఆజ్ఞ పొంది దులపటం లేదా? అదీ అలాగే! అయితే అమ్మను తెలుసుకొని మన బ్రెయిన్ సెల్స్ అన్నింటిని మెడిటేషన్ ద్వార క్రియానుకూలం చేయగలిగితే అంతా తానైన అమ్మ కరుణిస్తే ఇది ఒక చిన్న క్రియే అమ్మకు.

 

ఎండు వెదురు కర్ర నుండి సప్తస్వరాలు వినిపించినట్లు అమ్మ శరీరంతో వున్నది గనుక అందులో వున్నఆధ్యాత్మిక శక్తి ఎండి పోయిన వేరుశెనగ కాయలోని పప్పులా, అందులోని నూనెలా ఉంటుందని మనము గుర్తించలేము. మనం మన "నేను"ను మన శరీరానికి ఆపాదించికున్నట్లు మనం మన "అంఆ" ను కూడా ఆ పరిమితమైన శరీరానికి పరిమితం చేసి భావన చేస్తున్నాము. అలాకాక బావి వేరు అందులోని నీరు వేరు అని గుర్తిస్తే నీరు తోడే కొద్ది వస్తూనే వుంటుంది. అలాగా మన అమ్మ ఆధ్యాత్మిక అనంతమయిన శక్తి.

 

ఈ పరిమితమయిన శరీరంతో వచ్చి జిల్లెళ్లమూడికి పరిమితమయి ఎక్కడా  లేనట్లు విద్యాలయాలు ఆరోగ్యాలయాలు  ఏర్పరచటానికి కాదు తను వచ్చింది .తన Cosmic Vibrations  జిల్లెళ్లమూడి నుండి ప్రసరింప చేయటానికి.   అవి జరుగుతూనే వున్నవి.  అవి ఎందరో అందుకుంటూనే వున్నారు, ఆనందిస్తూనే వున్నారు.  ఎందరో  ఆ  మహా వృక్షం నుండి పండ్లు అందుకుంటూ వుంటే మనం ఆ చెట్టు నుండి రాలిన ఎండుటాకులను కూడా ఏరుకోవటానికి సిద్ధంగా  లేము.

 

        ఒక వస్తువు ఒక చోట  వుంది అని గుర్తించటానికి గుర్తు పెట్టుకుంటాము. అలాగే ఏ వూరయిన చేరటానికి Sign Boards పెట్టుకుంటాము. అలాగే ఇక్కడ నుండి Cosmic Vibrations ప్రసరిస్తున్నవి అని తెలియటానికి అమ్మ హైమాలయం అనసూయేశ్వరాలయాన్ని మనకోసం ఏర్పరిచింది. ఆ  Cosmic Vibrations కేంద్రాన్ని తెలుసుకుని (జిల్లెళ్లమూడి) దర్శించటానికి వస్తారు.  అందుకే అమ్మ 1968 ఏప్రిల్ 6 న ఆ prephacy  ని బయటపెట్టి ప్రకటన చేసింది.  

 

“జిల్లెళ్లమూడి లో ఉన్న ఆలయాలు భావికాలంలో అసంఖ్యాక తపస్సులకు పుట్టినిల్లు అవుతుంది. యోగులకు సాధకులకు నిలయం  అవుతుందని, ప్రేమకు కారణ్యనానికి, త్యాగానికి సర్వమానవోత్తమ గుణాలకు, దైవత్వానికి, ముఖ్యస్థానం అవుతుందని, ఎన్నో తపోవనాలు  ఏర్పడతాయని, ఇది ఒక పవిత్ర పుణ్య క్షేత్రము అవుతుందని అమ్మ ప్రకటించింది.

 

శ్రీశైలంలో సిద్ధి పొందిన  పూర్ణనందస్వామి అమ్మను 1969 లో దర్శించి , దసరాలలో 10 రోజులు అమ్మను అర్చించి,  ఇది ‘లలితా స్థానమని ‘ అమ్మని  ‘భువనేశ్వరిదేవిగా’   గుర్తించారు. వారి శిష్యులు వారిని శివస్వరూపంగా నమ్ముతారు. వారి శిష్యులు ఎందరో అమ్మ దగ్గరికి వస్తూ ఇక్కడి   ఫంక్షన్స్  లో  పాల్గొంటుంటారు.

 

ఈ మధ్యకాలములో ఒక యోగిని  USA  వెళ్ళింది. ఆమెను చూడటానికి అందరితో బాటు మా రెండవ కుమారుడు రహి వెళ్లి దర్శనం చేసుకున్నాడు.

 

యోగిని :  నీవు తెలుగువాడివా?  నీ పేరు?

రహి     :  అవును,  నా పేరు 'రహి'  జిల్లెళ్ళమూడి అమ్మ పెట్టింది.

 

యోగిని : ఎంతో ఆనందంగా తన కుడి చేతి హస్తాన్ని తన హృదయం మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని రెండు మూడు నిమిషాలు ట్రాన్స్ లోకి  వెళ్లి కళ్ళు తెరచి 'నీవు చాలా అదృష్టవంతుడివి, ఆ మహాతల్లి అమ్మను చూచావు'  అని తలమీద  చేయి పెట్టి దీవించి,  ప్రసాదం ఇచ్చింది. ఆ యోగిని చిన్నతనంలో తన తల్లితో జిల్లెళ్ళమూడికి వచ్చి అమ్మ దర్శనానికి , కృపకు  పాత్రురాలియింది . ఆమే కరుణామయి “నెల్లూరు విజయేశ్వరి.”

 

             1974 సంవత్సరంలో    అమ్మను చూచిన తరువాత ,  Richard,   పుట్టపర్తి వెళ్లి , స్వామితో 'జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గర నుండి వస్తున్నాను.' అని చెప్పారు. అప్పుడు స్వామి Richard తో 'ఆమె నీకే కాదు నాకు కుడా అమ్మే'  అని చెప్పారు.

            ఇలా ఎందరో మన అమ్మ నుండి  Cosmic Vibration అందుకుంటూనే వున్నారు,  ఆనందిస్తున్నారు.          

            కాని,  మనం చిదంబరం తాతగారు  చెప్పినట్లు 'అలుకు గుడ్డలో కూడా దైవాన్ని దర్శించు'   అనే మతంలో పుట్టి , దైవం తనకు తానుగా ఈ భూమికి వస్తే, 'అలుకు గుడ్డగా'  ఆ దైవాన్ని చూస్తున్నాము.

              అదే మన నేటిస్థితి ఇపుడయిన మాయ(అహంకారం) కమ్మిన కళ్ళను తుడుచుకొని సరిగా చూడటానికి ప్రయత్నిద్దాం.  ఈ   మధ్యకాలంలో మన డ్యూటీ  ఈ సంస్థను, ఈ ఆవరణాన్ని, ఈ దేవాలయాలనూ అందంగా తపోవనాలతో

సుందరంగా తీర్చిదిద్ది అమ్మ యొక్క Cosmic Vibration  ని అందుకొని,  తమ మనస్సులను శరీరాలను నింపుకొని , అమ్మ దర్శనానికి వచ్చే తపస్వులు యోగులు సాధకుల కోసం ఎదురు చూచి వారిని ఆహ్వానించి ఆనందింపజేస్తే,  అమ్మ కృపకు మనం పాత్రలమవుతాం.     అవును!  ఆ స్థితి అమ్మ మనకు కలుగజేస్తుంది.

 

            మీరు అనుకుంటే నన్ను  చూడలేరు. నేను అనుకుంటేనే 'నన్ను మీరు చూడగలుగుతారు---అమ్మ

            శ్రద్దా   సేవిత సద్ గురోస్వభావ జోపదేశపాలనే వీర్య లాభః

            “నమ్మకమే   భగవంతుడు   నాన్నా!” ------------అమ్మ

 

Author: 
రాచర్ల లక్ష్మి నారాయణ
Source: 
విశ్వజనని మాసపత్రిక సంపుటి ౩ సంచిక 10 | మే - 2004