“నీకున్నది  తృప్తిగా తిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో” ఇది ఒక ప్రముఖ ధార్మిక సంస్థ ప్రముఖలకు అమ్మ అందించిన అపూర్వ సందేశ సారాంశం. యువతరమువారి దృష్టిని ఆకట్టుకోగల వాక్యము మరొకటి ఉన్నదా!  ఆనిపించుతుంది.

 

వ్యక్తులను గాక, యువలోకమునే పరిగణించినప్పుడు మనమేమిచూస్తున్నాము? వారికి సన్యాసము గిట్టదు. అదే సమయములో సంకుచితత్వము కూడా వారు సహించరు. యువరక్తములో ఉన్న ఉదార స్వభావమే యిది. అమ్మ సందేశం ఈ స్వభావానికి పూర్తిగా సంతృప్తిపరుస్తుంది. కాలానికి కూడా మూలమైన అమ్మ ఈ కాలము వారి నాడిని చూసి, ఈ విధముగా నివాదము చేశారా? అని అచ్చేరువు వుందుతాము.

 

జీవనములో ఆనందము లేకపోతే, జీవితము ఒక్క క్షణము కూడా సాగదు. ఇది ఉపనిషత్తులు అవిర్కష్కరించిన పరమ సత్యము. పిల్లలకూ, పడుచువారికి భవిషత్ ఉంది. అభివృద్ధి వారిని ఆహ్వనిస్తుంది. ఈ అబివృద్ధి సాధించాటినికి వారికి జీవనము కావాలి. ఈ జీవనానికి ఆనందం ఆవశ్యకము. అందుచేతనే బిడ్డల పెంపు మీద దృష్టి ఉంచే అమ్మ “తృప్తిగా భుజించు” అని సందేశమిస్తున్నారు. ఈ భోగము స్వార్థపరమైతే వారి అంతరికావృద్ధిని ఆటంకపరుస్తుంది. ఆ వికృత పరిణామమును వారించటానికే “తృప్తిగా పంచి పెట్టుకో” అని సోధనాంశమును కూడా జోడించారు.

 

తృప్తిగా ఇతరులుకు పెట్టుకో' ఇది ఆదిలో దోషనివారకముగా మాత్రమే పనిచేసిన, పోనుపోను ఇదే ముఖ్యాంశమై అభివృధి సాధకముగా రూపొందుతుంది. ఎలా? పై సందేశానికి మూలమై, దానిని పోషించే, అమ్మ నిర్దేశించిన మరొక సూత్రవాక్యముంది.

 

పరివతమైన మమత మానవత్వమైతే, విస్తరించిన మమత  దివ్యత్వమవుతుంది

 

తృప్తిగా ఇతరులకు పంచిపెట్టుకోవడం అంటే, ఇతరులకు పంచిపెట్టినప్పుడు తృప్తి కలిగే విధంగా పంచిపెట్టడం. మనం భుజించినప్పుడు పొందే తృప్తిని ఇతరులకు పెట్టి, వారు భుజించేటప్పుడు పొందుతాము. అంటే మనయందు మనకుండే మమతే ఇతరులయందు ఏర్పడుతుంది.

 

“నా మమత విస్తరించుతోంది, దానితో బాటు నేను విస్తరించుతున్నాను”

 

ఈ విధంగా పై సూత్రమునుబట్టి నా మానవత్వము దివ్యత్వములోనికి పరిణిమించుతోంది. ఈ మమతను ఇలా విస్తరింపజేయటానికే “తృప్తిగా పంచి పెట్టుకో” అని మార్గము చూపారు, సందేశములో. తృప్తిగా భుజించు - అనే సందేశము లోని భాగము మనవాభివృద్ధిని సాధించగా, తృప్తిగా పంచిపెట్టుకో - అనే భాగము అదే మానవుని యొక్క దివ్యాభివృద్ధిని సాధించును. యువకులు ఈ విచక్షణను గుర్తించకపోయిన అభివృద్ధి ఆకాంక్ష స్పంధించుతూ ఉండేవారితత్వం అమ్మ చెప్పిన పై సూత్రము లను విని, విచారించినప్పుడు, ఆ విచక్షణ వారిలో వెలుగనారభించి, వారిని ఆకట్టుకుంటుంది.

 

ఇలాంటి సూత్రవాక్యములను చెదురుగా విని ప్రభావితులైన వారికి యువకులు అమ్మ జీవిత చరిత్రను చదివితే చకితులు కాగలరటములో సందేహము లేదు. ఏలన, వారి మృదు స్వభావముపై ఏ విశేషమైనా ఎంత సులభముగా ముద్రవేసుకుంటుందో, అమ్మ బాల్య జీవతము అంత అద్భుతముగా, అంత చిత్ర విచిత్రముగా ఉంటుంది. మొదటసారి సముద్ర స్నానము చేస్తూ, ఒక బాలుడు అభంగముగా పైబడే తరంగాల తాకిడికి ఎంత ఉల్లాసితుదవుతాడో, “అమ్మ జీవిత మహోదధిలో తరంగాలకు” అంతకు మించిన సముల్లాసమును పొందగలడు. ఆ జీవిత సామరస్యమే అలాంటిది. అయితే అమ్మ వాజ్మయముతో యువలోకానికి పరిచి మేర్పరాచాలంటే, ఒక పథకము ప్రకారము నియతమగు ఇతోధిక ప్రయత్నం జరగాలి.

 

అమ్మ యొక్క అట్టి అతిలోక జీవిత విశేషాలను చదివినప్పుడు, ఇట్టి మహోన్నత జీవితము ఇపుడు మనముందు మనకాలములో భువి పై వెలుగొంతున్నదా? సందేహము పోడవచ్చు. అయితే, సత్యము సందేహాలకెపుడు భయపడదు. పైగా జిజ్ఞాన పరమైన సందేహాలను సత్యము ప్రోత్సహించుతూ “ఓ సందేహమా, వచ్చి నన్ను పరీక్షించోకో” అని ఆహ్వానిస్తుంది కూడ. అమ్మ సరిగ్గా అదే చేస్తున్నారు. “వింటే  విమర్శగాని  కంటే  విమర్శ లేదని” వక్కాణించుతున్నారు. ఇది సందేహానికి అమ్మ విసిరిన సవాలు అని ఈ వాక్యములోని ధ్వని మనకు చెప్పక చెబుతోంది. యువకుల మేధా పదునుగా ఉంటుంది, కాని చిత్తము గట్టిగా ఉండదు. కావున అది సత్యస్పూర్తిని గ్రహించి తలవంచ గలదు. అందుచేత యువకులు మహదావకాశం “వినియొగించుకొందురుగాక, అని పై వాక్యము వారిని పిలుస్తోంది”.

 

ఇలాగని తలవంచిన విద్యాధికులైన యువకులు ఎవరైనా ఉన్నారా? లేకపోతే, అలాంటి వాక్యము అమ్మ నోటి వెంట ఎలా వెలుబడుతుంది? రెండు దృష్టాంతములు చూద్దాము.

అప్పుడు అమ్మకు 6, 7 సంవత్సరములు మాత్రమే. ప్రొద్దు క్రుంకిన తరువాత వెన్నెలలో ఒక సవారీ బండి వెనుక నడచి వెళ్తున్నారు. ఆ బండిలో దొప్పలపూడి గ్రామవాసి, బ్రహ్మయ్యగారి కుటుంబ సభ్యులందరు ప్రయాణం చేస్తున్నారు. వారిలో ఒక కాలేజి విద్యార్ధి కూడా ఉన్నాడు. ఆ విద్యార్థి, ఇతరులు అమ్మను పరిహాసము పట్టించారు. కారణం, అమ్మ ఇచ్చే విచిత్ర సమాధానములే! పర్యవసానముగా “ఈ అమ్మాయికి ముక్కూ చెవులు ఉన్నాయిగాని, బుద్ధి ఒక్కటే లేదు” అని ఆ విద్యార్థి, నవ్వేశాడు. అమ్మ అప్పుడు ‘బుద్ధి ఉంటేనేగా, బుద్ధి ఉందొ లేదో గ్రహించగలము’. అని చురకపెట్టారు. ఒక వైపు ఈ సంభాషణ సాగుతూ ఉండగానే రెండవవైపు అమ్మ చిన్నారి రూపములో విచిత్రమైన మార్పులు గోచరించసాగాయి. బ్రహ్మయ్య గారికి తాను నిత్యమూ పూజించే ‘కనకదుర్గ’ పోలికలు అమ్మలో వీక్షించి, దిగ్బ్రాంతి చెంది “అమ్మా! కనకదుర్గా!” అని సాష్టాంగ పడ్డారు. అమ్మ తన కరుణా కటాక్షనమును ఆ విద్యార్ధి మీదకు త్రిప్పింది. ఇంకేమున్నది? వేళాకోళము పట్టించిన ఆ విద్యార్ధి అమ్మ పాదాలపై వాలాడు.

 

మరొక దృష్టాంతము; “గోపీ” అన్నయ్య విద్యాధికులు, తత్వశాస్త్రములో పరిచయము ఉన్నవారు. అమ్మను వ్యతిరేక భావముతో దర్శించారు. ఇటివలే ఈ సంఘటన జరిగింది. అమ్మ వారికి 1,2 నిమిషాలు దర్శనమిచ్చి, లేచి లోపలకు వెళ్ళిపోబోతున్నారు. అంతలో రామకృష్ణ అన్నయ్య “మీతో వారు సంభాషించ గోరుతున్నారు కాబోలు” కల్పించుకుని అమ్మతో నెమ్మదిగా చెవి దగ్గర అన్నారు. లేవబొయిన అమ్మ కూర్చొని, గోపి అన్నయ్య వైపు తన దైవ దృష్టి సారించారు. అంతే తరువాత ఏమి జరిగిందో! ఇటివల ఆ అన్నయ్య “మాతృశ్రీ” లో వ్రాసిన వ్యాసములో చదివి తెలుసుకోవాలని కోరుతున్నాను. అంతటి అద్భుతనానందము అమ్మ గాక మరి ఎవరు ఇవ్వగలరు? ఇట్టి అనుభవాలను అమ్మ అతి బాల్యములో కూడా ఎంతోమందికి కలిగించారు. అయితే ఇంతకంటే సర్వ సాధారణముగా అమ్మ ప్రయోగించే ‘పటుదర సుక్ష్మతర’ శక్తి మరొకటి కలదు. దాని క్రియ మహిమగా కనిపించదు. అందుచేతనే అమ్మ అపుడప్పుడు అది ప్రయోగిస్తారు. “ప్రయోగించటం” సరి అయిన పదం కాదు. ఆ శక్తీ అమ్మకు అతి సహజము కనుక అది అలా ప్రవృత్తము అవుతుంది.

 

అది ఏది?

(రెండవ భాగము లో చదవండి)

 

Author: 
కిమో
Source: 
మాతృశ్రీ మాసపత్రిక (తెలుగు) | సంపుటి 8 | జనవరి, ఫిబ్రవరి - 1974 | సంచిక 10&11