నా మనసులో ఎప్పటి నుండో మాతృశ్రీ అధ్యయన పరిషత్ మన పట్టణంలో కూడా ఎందుకు స్థాపించకూడదు అని నా మనసు కూడా ఉవ్విల్లూరుచుండెడిది. ఈ లోగా 1974 లో అమ్మ తెలంగాణా పర్యటన గురించి తెలుసుకొని అమ్మను మన పట్టణమునకు కూడా ఆహ్వానించి అమ్మచే అధ్యయన పరిషత్ ప్రారంభించవలెనని ధృఢ సంకల్పముతో పరోక్షముగా అమ్మ అనుమతి తీసుకొని కార్యక్రమమునకు ఉపక్రమించి తిని. వెంటనే కొందరు పురప్రముఖులతో అమ్మ ఆహ్వాన సంఘము స్థాపించి అమ్మ పర్యటనకై పట్టణములో చురుకుగా ఏర్పాట్లు జరుగుచుండెను. మంచి కార్యకర్తలు చురుకుగా ఏర్పాట్లు చేయుచుండిరి. ఈ కార్యక్రమ వివరాలన్నీ వ్రాసి నేను జిల్లెలమూడికి వెళ్లి అమ్మ పాదములఫై ఉంచి నమస్కరించి అమ్మా మీరు మా పట్టణమునకు వచ్చి అధ్యయన పరిషత్ ప్రారంభించవలెనని వేడుకొంటిని అమ్మ నన్ను దీవించి, నా వైపు తీక్షణముగా చూచి నేను చెప్పినది విని మౌనముగా నుండెను. ఆ సమయంలో అమ్మ పర్సనల్ సెక్రటరీ కీర్తిశేషులు కొండముది రామకృష్ణ అన్నయ్య మరియు ఇతరులు అన్నయ్యా అమ్మ పర్యటన కార్యక్రమాలన్నీ ఫిక్స్ అయిపోయినవి మీరు కొంచెం ముందుగా రాకుంటిరి అని నన్ను నిరుత్సాహపరచినారు. కానీ నేను నిరుత్సాహపడకుండా అవును నేను ముందుగా రానిది నా పొరపాటే కానీ అమ్మతో పరోక్షంగా ఆజ్ఞ తీసుకొనే ఈ కార్యక్రమములన్నీ పూర్తి చేసుకుని నేను వచ్చే వరకు ఆలస్యం అయినది. ఎలాగయినా అమ్మ రావలసిందే అధ్యయన పరిషత్ ప్రారంభించవలసిందే. అంత వరకు నేను తిరిగి వెళ్లను. ఇది నా ధృఢ సంకల్పం. నేను తిరిగి వెళ్లి వీళ్లందరికీ అమ్మ రావటం లేదని ఎలా చెప్పేది. ఎలా వెళ్ళేది. ఇంతలో అమ్మ కల్పించుకొని తిరుగు ప్రయాణంలో ( రిటర్న్ జర్నీ మీ ఊరికి వస్తానని నాకు అభయమిచ్చినది. ఎలాగయితేనేం అమ్మ 19.3.74 లో మా ఊరు వచ్చి మా యింట్లోనే మా పూజలందుకొని అధ్యయన పరిషత్ కూడా మా యింట్లోనే తన కరకమలములతో ప్రారంభించినది. అమ్మ రాక సందర్భంగా ఆనాడు పట్టణంలో అమ్మ దర్శనానికై లక్షల కొద్దీ జనులు అమ్మను దర్శించుకొని పునీతులైరి buy cialis online uk. అంత మంది జనం మా పట్టణంలో ఎప్పుడూ రాలేదు. అమ్మ వరంగల్, కరీంనగర్, డోర్నకల్, ఖమ్మం పట్టణాలలో పర్యటించి చివరగా మళ్లీ జిల్లెళ్ళమూడి వెళ్ళినది. వెళ్లగానే అక్కడి వారితో నాకు మహబూబాబాద్ కార్యక్రమము చాలా నచ్చింది నాన్నా! అని చెప్పినదట. నేను తదుపరి జిల్లెల్లమూడి వెళ్ళినప్పుడు నన్ను చూడగానే వాళ్లంతా అన్నయ్య అమ్మకు మీ మహబూబాబాద్ బాగా నచ్చినదట, అని చెప్పినపుడు నా సంతోషానికి అవధులు లేవు. ఒకసారి మేము జిల్లెళ్ళమూడి వెళ్ళినపుడు అమ్మతో సెలవు తీసుకుని మేమందరం మా సామానుతో వానులో కూర్చున్నాము. ఎవరో వచ్చి మిమ్మల్ని అమ్మ పిలుస్తునది అని చెప్పితే మేము అమ్మ దగ్గరికి వెళ్ళినాము. ఈ లోపు డ్రైవరు మా సామానంత దించి వెళ్ళిపొయినాడు. నేను డ్రైవరుతో ఘర్షణ పడుతుండగా కొందరు వెళ్లి అమ్మకు చెప్పినారు. మళ్లీ నేను అమ్మ దగ్గరికి వెళితే ఏమిటి నాన్నా కేకలు, ఘర్షణ ఏమిటి అని అడిగినది అయితే నాకు డ్రైవరుతో జరిగిన విషయమంతా చెప్పినాను. అయితే అమ్మ అన్నది వాడు నీ వలె చదువుకున్నవాడు కాదు, జ్ఞానము లేనివాడు నువ్వు డాక్టరువి, చదువుకున్నవాడివి నీకు శాంతం, ఓపిక ఉండాలి కదా! మీరు వానులో కూర్చున్న తరువాత నేను మీకు బట్టలు పెడదామని పిలిపించాను అని చెప్పినది. అమ్మ ఆనాడు కృష్ణ పరమాత్మ అర్జునునికి గీతోపదేశం చేసినట్లే ఈనాడు నాకు అమ్మ సందేశం వినే భాగ్యం అవకాశము కల్గించినందుకు సదా మేము క్రుతజ్ఞలము. ఇలా ఎన్నెన్నో అమ్మతో అనుభూతులు,సందేశములు మాకు కలిగినవి. అమ్మ ఎల్లప్పుడు మాపై అవ్యాజమైన ప్రేమ కరుణ మాఫై కురిపిస్తూనే ఉంటుంది. అమ్మ మాకు బట్టలు పెట్టి తన కారులో పంపించినది.

Author: 
పి. వెంకట నారాయణ
Source: 
విశ్వజనని మాసపత్రిక ,సంపుటి 5, సంచిక 10 - మే 2006.